పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తోన్న ప్రముఖ నటి

పీరియడ్స్ అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక సహజమైన భాగం. ఇది కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు, మహిళల ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ వంటివి చాలా మందికి కఠినమైన అనుభవాలుగా మారతాయి. అయితే ఓ నటి పీరియడ్స్ రాకుండా ఇంజెక్షన్స్ తీసుకుంటున్నానని తెలిపి సంచలనం సృష్టించింది.

సినీ నటి, కమెడియన్ స్నిగ్ధ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మహిళలకు నెల నెలా వచ్చే పీరియడ్స్ బాధ గురించి, దాన్ని నివారించడానికి తాను అనుసరిస్తున్న పద్ధతుల గురించి ఆమె చాలా బోల్డ్‌గా మాట్లాడారు.

Actress Snigdha s Shocking Admission Using Steroids to Avoid Periods Pain

పీరియడ్స్ బాధను భరించడం నిజంగా నరకం. ఆ నొప్పిని ఎవరు భరిస్తారు? అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ బాధను తప్పించుకోవడానికి తాను స్టెరాయిడ్స్ వాడుతున్నానని, తద్వారా పీరియడ్స్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నానని తెలిపారు. తనకు థైరాయిడ్ సమస్య ఉన్నందున, సాధారణంగా మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే పీరియడ్స్ వస్తాయని, అందుకే ఈ పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారు.

ఇటీవల శివమాల ధరించి కనిపించిన స్నిగ్ధను.. పీరియడ్స్ సమయంలో మాల ఎలా కొనసాగిస్తారని అడిగినప్పుడు, స్టెరాయిడ్స్ వాడి పీరియడ్స్ ఆపుకుంటానని షాకింగ్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, "ఆరోగ్యానికి హానికరం కదా?" అని యాంకర్ అడిగినప్పుడు, పీరియడ్స్ నరకం నుంచి పూర్తిగా విముక్తి కావాలంటే గర్భసంచినే తీయించుకుంటే మంచిది అని మరింత బోల్డ్‌గా కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె బోల్డ్ అండ్ ఫ్రాంక్ నెస్​ను మెచ్చుకుంటుండగా, మరికొందరు ఆరోగ్యానికి ప్రమాదకరమైన పద్ధతులను ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. స్నిగ్ధ వ్యాఖ్యలు మహిళల పీరియడ్స్ బాధపై బహిరంగ చర్చకు దారితీశాయని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+