స్టార్ బ్యూటీ " శ్రీలీల " వీడియో వైరల్.. అడ్డంగా దొరికిపోయిందిగా !
తెలుగు చిత్ర పరిశ్రమలోకి "పెళ్లి సందD" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నటి " శ్రీ లీల ". ఆ తర్వాత నుంచి తన నటనతో, గ్లామర్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ.. రవితేజతో నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పటి నుంచి హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ. తెలుగు, తమిళ్ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు దక్కించుకుంటుంది.
డేటింగ్ నిజమేనా..?
హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. కాగా ప్రస్తుతం హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమాయణం మొదలైందని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై శ్రీ లీల కానీ ఆర్యన్ కానీ ఇంకా స్పందించలేదు.

మరోవైపు ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసేలా కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అన్నారు. ఆ మాటలు శ్రీలీలను ఉద్దేశించే అన్నారని ఓపెన్ గానే డిస్కషన్ నడిచింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అందరూ భావించారు. అంతే కాకుండా పలు పార్టీల్లో సైతం వీరిద్దరూ రెగ్యులర్ గా కనిపిస్తుండడం మరింత చర్చకు దారి తీసింది.
ఇక ఇప్పుడు మరోసారి కార్తీక్ ఆర్యన్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యింది శ్రీలీల. దీంతో మళ్లీ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ నుంచి శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ బయటకు వస్తున్న వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇక శ్రీ లీల కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆమె రవితేజతో కలిసి "మాస్ జాతర" సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్", కిరీటి రెడ్డి "జూనియర్" వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
-
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
రణవీర్ సింగ్ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!












Click it and Unblock the Notifications