విడదల రజినిపై శ్రీరెడ్డి బూతు పురాణం
నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.
తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలపై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తాజాగా మాజీ మంత్రి విడదల రజినిపై శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. విడదల రజిని లాంటి వారి వల్లే పార్టీకి ఈ దూస్థితి అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. అసభ్యపదజాలంతో విడదల రజినిపై శ్రీరెడ్డి మండిపడ్డారు. విడదల రజిని టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గెలవాలని ప్రయత్నించిందని శ్రీరెడ్డి తెలిపారు. విడదల రజిని ఓ చెత్తగా ఆమె అభివర్ణించారు. విడదల రజనిని పక్కన పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని తాను ముందే చెప్పానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications