బ్రేకప్ బాధలో తండ్రీకూతుళ్లు.. ఇద్దరూ కలిసి మందు తాగుతూ !
బిగ్‌బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించిన నటి శ్రీ సత్య. అంతకు ముందు పలు కార్యక్రమాల్లో మెరిసిన ఆమె.. Bigg Boss Telugu 6 షో ద్వారానే క్రేజ్ తెచ్చుకోగలిగింది. ఈ షోలో తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్, ఆటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫాలోయింగ్ పెంచుకుంది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ సత్యకు వరుస అవకాశాలు దక్కాయి.
ప్రముఖ డాన్స్ రియాలిటీ షో అయిన BB Jodiలో పాల్గొని తన డ్యాన్స్ టాలెంట్‌ను చూపించింది. అలాగే యూట్యూబ్, టీవీ షోలలో గెస్ట్ అపియరెన్స్‌లు ఇస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది. తన పర్సనల్ లైఫుతో పాటు ప్రొఫెషనల్ కెరీర్ కి సంబంధించిన విషయాలని సైతం పంచుకుంటూ బిజిబిజీగా గడుపుతుంది.

ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇటీవల యాంకర్ వర్షతో 'కిస్సిక్ టాక్ షో'లో పాల్గొన్న శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మద్యం, సిగరెట్ అలవాట్ల గురించి అడిగినప్పుడు, తాను సిగరెట్ తాగనని స్పష్టం చేసింది. అయితే మద్యం తాగుతానని చెప్పి, "మా డాడీ ఏ బ్రాండ్ తీసుకొస్తే అదే తాగుతాను" అని చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తండ్రితో తన బంధం గురించి శ్రీ సత్య చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
శ్రీసత్య మాట్లాడుతూ.. "మేమిద్దరం ఫాదర్-డాటర్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం" అని ఆమె తెలిపింది. తన వ్యక్తిగత విషయాలు, బాధలు, బ్రేకప్‌లు అన్నీ తండ్రితో పంచుకుంటానని, ఆయన కూడా తనతోనే ఓపెన్‌గా మాట్లాడతారని చెప్పింది. ఈ ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ కారణంగా ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడం, టైమ్ స్పెండ్ చేయడం సాధారణమేనని వివరించింది. కొన్నిసార్లు తండ్రితో కలిసి బయటికి వెళ్లి రిలాక్స్ అవుతామని వెల్లడించింది.
కాగా "మూడ్ బాగోలేకపోతే బయటికి వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తామని.. కొన్ని సందర్భాల్లో కలిసి డ్రింక్ కూడా చేస్తామని చెప్పింది. అంతే కాకుండా ప్రేమ, పెళ్లి విషయంలో తనకు తండ్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని శ్రీ సత్య వెల్లడించింది. "నచ్చిన వ్యక్తిని ఎంచుకుని పెళ్లి చేసుకోమని మా నాన్న చెబుతాడు" అని ఆమె పేర్కొంది. కుటుంబం నుంచి వచ్చిన ఈ సపోర్ట్ తనకు చాలా ముఖ్యమని, అదే తనలో కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పింది.
ఇక తండ్రితో కలిసి పబ్‌లకు వెళ్లిన సందర్భాలను కూడా ఆమె సరదాగా పంచుకుంది. "పబ్‌లో ఎవరైనా గుడ్ లుకింగ్ అబ్బాయి కనిపిస్తే వెంటనే మా నాన్నకు చెబుతా. ఆయన మాత్రం ఇంకో ఆప్షన్ చూపిస్తూ సరదాగా మాట్లాడుతాడు" అని చెప్పింది. ఈ విధంగా తమ మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు తమ బంధాన్ని మరింత బలపరుస్తాయని తెలిపింది. అదే తనను తప్పు దారిలో వెళ్లకుండా కాపాడుతుందని ఆమె అభిప్రాయపడింది.
మరోవైపు శ్రీ సత్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ఓపెన్‌నెస్, తండ్రితో ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్‌ను ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలను బహిరంగంగా పంచుకోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications