Betting Apps: క్షమించండి.. తెలియక ప్రమోట్ చేశాను..
Betting Apps: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు అమాయక యువకులను టార్గెట్ గా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు అప్రమత్తమవుతున్నారు. తాజాగా శుక్రవారం నాడు నటి సురేఖ వాటి, ఆమె కూతురు సుప్రీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
కొంత మంది తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని.. అందులో తాను కూడా ఉన్నట్లు సుప్రీత ఇన్‌స్టా వీడియోలో తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను ప్రస్తుతం ఆపేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీత రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల చూసి ప్రభావితం కావద్దని.. ఈజీ మనీకి అలవాటు పడొద్దని సుప్రీత సూచించారు. తమ ఫోన్లలో బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలని ఆమె కోరారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిని ఫాలో కావద్దని.. ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నటి సురేఖ వాణి కూడా బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఇన్‌స్టా వేదికగా వీడియో చేశారు. ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయవద్దని సూచించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు బలి అయిపోయాయని.. అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని సలహా ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా అలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయవద్దని సురేఖ వాణి కోరారు. ఈ వీడియోను సురేఖ వాణి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కు ట్యాగ్ చేశారు.












Click it and Unblock the Notifications