అతనితో ఎంజాయ్ చేస్తోన్న సురేఖ వాణి
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది నటి సురేఖ వాణి.
ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఆమె వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది.

సురేఖ వాణికి యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆ మధ్య కూతురు సుప్రితతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా ఆ మధ్య మీడియాలో వైరల్ అయింది. కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరికి సురేఖ వాణి బహిరంంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సురేఖవాణి పబ్బులో ఒక గుర్తు తెలియని వ్యక్తితో డాన్స్లు వేస్తూ మరి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే సురేఖ వాణి తో గుర్తు తెలియని వ్యక్తి డాన్స్ వేయడమే కాకుండా ఆమె మీద చేతులు వేసి మరి డాన్స్ వేస్తూ దగ్గరికి తీసుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications