పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని కంటానంటున్న బోల్డ్ బ్యూటీ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సపోర్టింగ్ పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి " తేజస్వి మదివాడ". డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. 2012లో విడుదలైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలో చిన్న పాత్రే అయినా.. ఆమె అందం, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో పాత్రతో మరింత గుర్తింపు వచ్చింది. మల్టీ-స్టారర్ అయిన ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేశ్ వంటి తారలతో కలిసి నటించడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ అయింది. ఆ తర్వాత తేజస్వి వరుసగా 'మనం', 'హార్ట్ ఎటాక్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఐస్‌క్రీం', 'ప్రేమికులు' వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే నాగార్జున హోస్ట్‌గా వచ్చిన 'బిగ్ బాస్' సీజన్ 2లో పాల్గొనడం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ షోలో ఆమె నిజమైన స్వభావం, బోల్డ్ నైజం ప్రేక్షకులకు నచ్చడంతో ఆమెకు బుల్లితెరపై ఓ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా టీవీ షోలు, ఈవెంట్ యాంకరింగ్, సోషల్ మీడియా కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నారు.
"పెళ్లి వద్దు... కానీ పిల్లలు కావాలి"..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి మదివాడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె బోల్డ్‌గా మాట్లాడుతూ, ''నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. పెళ్లి చేసుకోనన్న నిర్ణయం తీసుకున్నాను. కానీ పిల్లలు మాత్రం కావాలి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదని చెప్పేసింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తొందరగా వయసు అయిపోతే బాగుంటుంది అంటూ తెలిపింది.
కి పిల్లలు మాత్రం కావాలని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా ? టెస్టు బేబీ ద్వారా ప్లాన్ చేస్తారా అని ప్రశ్నించగా.. అదేం లేదు సుస్మితసేన్ పిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేసుకోలేదా అంటూ కామెంట్స్ చేసింది. కావాలంటే లివింగ్ రిలేషన్ లో అయినా ఉంటానని చెప్పడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తూ రియాక్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications