అప్పుడు డబ్బులు లేక టెన్త్ తర్వాత చదువు స్టాప్.. కానీ ఇప్పడు స్టార్ హీరోయిన్ !

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. మరి ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సినిమా ప్రపంచంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ముఖ్యం. ఎంతో మంది తారలు వెండితెరపై ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు కనుమరుగు అయినా వారు ఉన్నారు. అలానే ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఒకప్పుడు కష్టాల కడలిలో జీవితాన్ని సాగించిన వారే.

ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో.. 10వ తరగతి తర్వాత చదువు మానేసిన ఓ అమ్మాయి.. ఇప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విభిన్న పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరు ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..?

actress-tejaswi-pandit-open-up-on-her-real-life-struggles-about-studies

తేజస్విని పండిట్.. మరాఠీ, హిందీ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004 లో "కన్చన్: ఎక్స్ ప్రెస్" సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత "వాహి లైఫ్ हो तो ऐसी," "అగ్నిదివా," "మిస్ మాచ్" వంటి చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అలానే ఆమె నటించిన "ముళ్షి పటాన్," "ఎక్స్‌పిరియన్స్," "ఏప్రిల్ ఫూల్," "యే రే యే రే పైసా" వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో వచ్చిన "యే రే యే రే పైసా" ఆమె కెరీర్‌లో టానింగ్ పాయింట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన "యే రే యే రే పైసా 3" రాబోతుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైనా కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది తేజస్విని. టెన్త్ తర్వాత ఆర్ధిక పరిస్థితులు కారణంగా చదువుకు దూరం అవ్వాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

actress-tejaswi-pandit-open-up-on-her-real-life-struggles-about-studies

తేజస్విని ఏమన్నారంటే..

10వ తరగతి వరకు మాత్రమే చదివిన.. ఇంటీరియర్ డిజైనింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలని కలలు కన్నట్టు తెలిపింది. అయితే ఆ కోర్సుల ఫీజు రూ.80 వేలు ఉందని.. కానీ తన తండ్రి ఆర్థిక స్థితి దారుణంగా ఉండటంతో తన కోరికను వదిలేసినట్టు తెలిపింది. అందుకే చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చదువు కొనసాగించాలని లేదని.. కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్టు ఓపెన్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+