రాజమౌళితో సినిమా చేయనని చెప్పిన త్రిష..?

దర్శకుడు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయిన కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా , చేయనని చెప్పారట హీరోయిన్ త్రిష.

రాజమౌళి దర్శకత్వంలో త్రిష మిస్ చేసుకున్న సినిమా మరేదో కాదు మర్యాద రామన్న. స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో హీరోగా చేశాడు. అతనికి జోడిగా కొత్త భామ సలోని నటించినది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 2010లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రూ. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన మర్యాద రామన్న ఫుల్ రన్ లో రూ. 28 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకుందామని అనుకున్నారట రాజమైళి.

Actress Trisha rejected Rajamouli film

ఆమెతో సంప్రదింపులు జరిపారగా... సునీల్ వంటి కమెడియన్ పక్కన తాను నటించిన‌ని త్రిష డైరెక్ట్‌గానే చెప్పేసింద‌ట‌. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే అవకాశాన్ని సునీల్ కార‌ణంగా వదులుకుందట. ఇక‌ ఆ తర్వాత మ‌రికొంతమంది హీరోయిన్లను పరిశీలించిన రాజమౌళి.. ఫైనల్ గా సలోనిని సెలెక్ట్ చేశార‌ట‌. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం.అప్పటికే తెలుగు మరియు తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఆ కారణంగానే రాజమౌళి సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలుస్తోంది. త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+