ఇన్‌డైరెక్ట్ గానే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన "త్రిష".. ఆ విషయం లోనే !!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచిన అందాల భామ "త్రిష". తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అన్ని స్టార్ హీరోల సరసన నటించిన ఈమె తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక దశలో ఇండస్ట్రీలో అత్యధికంగా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగింది. ఈ మధ్య కొంత విరామం తీసుకున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఉత్సాహంతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా Ponniyin Selvan సినిమా ద్వారా ఆమెకు మళ్లీ భారీ క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు వచ్చిన ప్రశంసలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్', 'ఐడెంటిటీ', 'విదాయమర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

ఇటీవల త్రిష తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో Vijayతో ఆమె రిలేషన్‌పై వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్రిష గానీ, విజయ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో విజయ్ భార్య Sangeetha విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరో నటితో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు నోటీసులు జారీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వివాదంలో త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపించింది.

actress-trisha-strong-counter-to-trollers-over-negative-comments-and-relationship-rumours-on-her-on

ఈ క్రమంలోనే ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ గాసిప్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. అంతే కాకుండా విజయ్ ఎన్నికల్లో గెలిచిన వేళ.. ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆమె కనిపించారు. ఇక రీసెంట్ గానే నటుడు అజిత్ తల్లి మరణించగా.. విజయ్ తో కలిసి వెళ్లి ఆమె నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలు కొన్ని రోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ విషయం పైనే త్రిష (Trisha) సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ పెట్టారు. 'నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను' అని రాసుకొచ్చారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. తనపై రూమర్స్‌ క్రియేట్‌ చేస్తోన్న వారిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ పెట్టారని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+