ఒకప్పుడు టీవీ యాంకర్..ఇప్పుడు సినిమాకు 15 కోట్లు తీసుకుంటున్న తెలుగు హీరోయిన్
సినిమా వాళ్ల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఓడలు బండ్లు గానూ, బండ్లు ఓడలు గానూ మారుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటులు కొందరు, చివరి దశలో దుర్భర జీవితాన్ని అనుభవించారు. అలాగే తొలినాళ్లలో కష్టపడ్డ నటులు ఆ తర్వాత స్టార్లుగా మారిన వారు సైతం ఉన్నారు. గతంలో చిన్న టీవీలో యాంకర్‌గా పని చేసిన ఓ నటి, ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..లేడీ సూపర్ స్టార్ నయనతార.
నయనతార తన కెరీర్ స్టార్టింగ్‌లో ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేశారు. ఆ తర్వాత హీరోయిన్‌గా ఇచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ వెంటనే ఆమె నటించిన గజని సినిమా సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో నయనతార వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండాపోయింది.

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications