బిగ్ బాస్ షాక్..మిడ్ వీక్ ఎలిమినేషన్ అతనే
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా తన నాలుగు వారాలను పూర్తి చేసుకుని ఐదు వారంలో అడుగుపెట్టింది.ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు ఎవరూ కూడా షోకు తీసుకురాకపోవడంతో యామమాన్యంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కంటెస్టెంట్లు సైతం ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఈ సీజన్‌కు పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చినట్టు లేదని తేలింది.
మరోవైపు హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి. వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. నాలుగోవారం హౌస్ నుంచి సోనియా ఆకుల బయటకు వచ్చేశారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆదిత్య ఓం, అభిమానులు ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మొదటి వారంలో అయితే ఆదిత్య ఓం అసలు హౌస్‌లో ఉన్నారా అనే అనుమానం కూడా కలిగింది. నాగార్జున సైతం ఇదే విషయాన్ని ఆదిత్య ఓం దగ్గర ప్రస్తావించారు. అయినప్పటికీ తన ఆట తీరును మార్చుకొని ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మరోసారి నామినేషన్‌లో నిలిచారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆదిత్య ఓంను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ గురువారం ప్రసారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications