రోజా రీఎంట్రీ అదిరింది..!

తెలుగు, తమిళ ప్రేక్షకులను దశాబ్దాల పాటు తన అందం, అభినయంతో మెప్పించిన మాజీ హీరోయిన్, వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా సినీ అభిమానులకు ఊహించని శుభవార్త అందించారు. సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆమె నటిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు 'లెనిన్ పాండియన్' . ఇది తమిళ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో రోజా 'సంతానం' అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమె లుక్ చాలా కొత్తగా, సహజత్వానికి దగ్గరగా ఉంది. ఈ సినిమాకు బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ , 90s క్వీన్‌ను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కు తీసుకురావడం మాకెంతో గౌరవం అంటూ రోజా స్థాయిని తెలియజేసింది.

After 12 Years Ex-Minister Roja Announces Film Re-entry with Tamil Movie Lenin Pandian

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, రోజా నటనపై తనకున్న మమకారాన్ని ఈ రీఎంట్రీతో చాటుకున్నారు. ఆమె కొత్త లుక్‌తో విడుదలైన ప్రచార వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజా ఎంట్రీపై సినీ ప్రముఖులు స్వాగతించారు. ఖుష్బు, ప్రభుదేవా వంటి సీనియర్ యాక్టర్స్ రోజా రీఎంట్రీని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో తమ మద్దతు తెలిపారు. అయితే గతంలో గ్లామర్, హుందా తరహా పాత్రల్లో రోజాను చూసిన అభిమానులు , ఇప్పుడు డీగ్లామర్ పాత్రలో ఆమెను అంగీకరిస్తారా..? అనేది చూడాలి. ఈ సినిమాలో రోజా తన పాత్రలో ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తారో అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+