భారీగా పెరిగిన ప్రభాస్ రెమ్యునరేషన్

పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం సాధించిన సంచలన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లకు దగ్గరలో ఉంది. అలాగే విదేశాల్లో రూ.100 కోట్లు సాధించిన చిత్రంగా కూడా త్వరలోనే నిలవబోతోంది. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. రాజాసాబ్, స్పిరిట్, కల్కి2, సలార్2 చిత్రాలతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి చిత్రం చేయబోతున్నారు. ఇలా వరుసగా ఐదు సినిమాలు సిద్ధమవుతుండటంతో మిగతా హీరోలు కూడా అప్రమత్తమయ్యారు.

కష్టం అంటున్న నిర్మాతలు
ఇతర స్టార్ హీరోలు కూడా ప్రభాస్ లా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కల్కి చిత్రంలో నటించినందుకు డార్లింగ్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాహుబలి2 తర్వాత ప్రభాస్ పారితోషికంగా భారీగా పెరిగింది. అయితే కల్కి తర్వాత చేయబోయే చిత్రాలకు ప్రభాస్ రూ.200 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంత ఇవ్వాలంటే కష్టమని నిర్మాతలు అంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఒక్క రాజా సాబ్ చిత్రానికి మాత్రం తన పారితోషికాన్ని తగ్గించారు. ఆదిపురుష్ సినిమాను నైజాంలో విడుదల చేసిన ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కు రూ.40 కోట్ల నష్టం రావడంతో తన పారితోషికం నుంచి రూ.40 కోట్లు తగ్గించారు.

after kalki movie success Prabhas Remuneration has increased hugely

సినిమా సినిమాకు పెరుగుతున్న పారితోషికం
సినిమా సినిమాకు ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచుకుంటూ వెళితే అతనితో సినిమాలు తీయడం చాలా కష్టమవుతుందని నిర్మాతలు అంటున్నారు. ప్రభాస్ పారితోషికం పెంచారని, ఇతర స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాన్ని పెంచేందుకు సిద్ధపడుతున్నారు. లేదంటే పరిశ్రమలో తమకు డిమాండ్ తగ్గిపోయినట్లవుతుందని, అలా పెంచకపోతే మార్కెట్ లో తమకు డిమాండ్ లేదని మిగతావారు భావిస్తారనే ఉద్దేశంతో వీరంతా రెమ్యునరేషన్ పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఏదైనా ఒక అగ్ర కథానాయకుడు తన పారితోషికాన్ని పెంచితే మిగతా హీరోలు కూడా అదే బాటలో నడవం మంచి పద్ధతి కాదని సీనియర్ దర్శక, నిర్మాతలు స్టార్ హీరోలకు హితవు పలుకుతున్నారు. వారి మాటలను వీరు వినరు కదా!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+