ఏజంట్, భోళాశంకర్ తర్వాత ఇదేనా? వరుస హ్యాట్రిక్??
అనిల్ సుంకర అనే పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ చిరపరిచితమే. ఎలా అంటే.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజంట్, మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రాలకు ఆయనే నిర్మాత. రెండు వరుస డిజాస్టర్లకు నిర్మాతవడం ఆయన దురదృష్టమైనప్పటికీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజమే నే చెబుతున్నా..
తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరిపేరు భైరవకోన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన 'నిజమే నే చెబుతాన్నా జానే జానా.. నిన్నే ప్రేమిస్తున్నా' అనే పాట సూపర్ హిట్ అయింది. వాస్తవానికి 2021లో దీన్ని ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం ఈ పాటను విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు టీజర్ విడుదల చేశారు. అయితే ఆరునెలలుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వడంలేదు. దీంతో ఏజంట్, భోళాశంకర్ చిత్రాల ప్రభావం ఈ సినిమాపై పడిందని, చిత్రం విజయం సాధించడం కష్టం అనే అనుమానం రావడంతోనే దీన్ని గురించి అప్ డేట్ ఇవ్వడంలేదంటూ వార్తలు వచ్చాయి.

వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది
అయితే తాజాగా అనిల్ సుంకర దీన్ని ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ''తాము ఖరీదైన తప్పులు చేశామని, అవి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఉన్నామని ఊరిపేరు భైరవకోన చిత్రానికి వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎఫెక్ట్స్ నాణ్యంగా చూపించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, దీనివల్లే సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందని తెలియజేశారు. వర్క్ పూర్తవగానే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని, దీనికి సంబంధించిన రెండోపాటను త్వరలోనే విడుదల చేస్తామన్నారు''. దీంతో పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications