గుడ్ న్యూస్ చెప్పిన ఆహా ఓటీటీ

ప్రముఖ ఓటీటీ ఆహా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం అభిమానుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అల్లు ప్రొడక్షన్ నుంచి ఆహా రూపొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం రైటర్స్‌కు గుడ్ న్యూస్ అందించింది. ఆహా టాలెంట్ ఉన్న రైటర్స్ కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాణ సంస్థలైన మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్‌తో జత కట్టింది.

కథలో కొత్తదనం,సృజనాత్మకత, క్రియేటివిటీ ఉన్న రైటర్స్‌‌కు చక్కటి అవకాశం కల్పిస్తోంది. కామెడీ, థ్రిల్లర్,డ్రామా, హారర్,రొమాన్స్,యాక్షన్ జార్నర్ లో కథను చక్కగా నరేట్ చేయగల సత్తా ఉన్నవాళ్లకు సదవకాశం కల్పిస్తోంది. దీనిపై ఆహా కంటెంట్ హెడ్ వాసు దేవ్ కొప్పినేని కీలక విషయాలను వెల్లడించారు.గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎప్పుడు కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తారు. దేశ నలుమూలల నుంచి టాలెంట్ ఉన్న ఎంతో మంది కళాకారులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సంఖ్య ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. ఇది ఆహాలో ఒక సంస్కృతిగా మారింది.

Aha OTT invites new writers

ఒక మంచి కంటెంట్‌కు వెన్నెముక కచ్చితంగా రైటరే. ఈ మధ్య నిర్మాత SKN గారిని కలిసినప్పుడు తానే ఈ గొప్ప ప్రాజెక్టు కు ఊపిరి పోశారు. మన తెలుగు రైటర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రైటర్స్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే మేము టాలెంట్ హంట్‌ను ప్రారంభించాము. రైటర్స్‌కు ఇండస్ట్రీ కి మధ్య ఆహా ఒక వారధిలా మారిందని ఆహా కంటెంట్ హెడ్ వాసు దేవ్ కొప్పినేని చెప్పుకొచ్చారు.

Aha OTT invites new writers

ఇండస్ట్రీలో రైటర్స్ చాలా తక్కువగా ఉన్నారని నిర్మాత SKN అన్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ వారికి సరైన వేదిక లేక వెనకబడి ఉన్నారని ఇందుకోసమే ఆహా అమృత ప్రొడక్షన్స్ తో జతకట్టి ఫ్రెష్ టాలెంట్ ను వెలికి తీస్తున్నట్లు చెప్పారు.ఇక ఆసక్తి ఉన్న వారు, నచ్చిన జార్నెర్‌లో కథను రాసి పంపించాలి. టాలెంట్ హంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఆహా వెబ్‌సైట్ , ఆహా సోషల్ మీడియా పేజెస్‌లో పొందుపర్చారు. ఇంకెందుకు ఆలస్యం, మంచి కథ చెప్పే టాలెంట్ మీదైతే ,మీకు ఇండస్ట్రీలో గొప్ప అవకాశం కల్పించే వేదికగా ఆహా సిద్ధంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+