ఒక్క పోస్టరుతో సోషల్ మీడియా షేక్.. ఈ "స్పిరిట్" బ్యూటీ ఎవరంటే ?
గ్లోబల్ స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ సినిమా 2027 మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
కాగా హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, వాయిస్ నోట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. వివేక్ ఆనంద్ ఒబెరాయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను సైతం విడుదల చేశారు. ఒక చేతిలో కత్తి పట్టుకుని, నోటిలో సిగార్ తో.. ఆయన మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. అయితే పోస్టర్‌లో ఆయనతో పాటుగా మరో అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

ఆ అమ్మాయి ఎవరంటే..?
ఈ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్‌తో పాటుగా కనిపిస్తున్న ఆ బ్యూటీ పేరు ఐశ్వర్య దేశాయ్. ఆమె ఇండియన్ అమెరికన్ నటి అని.. "గల్లీ బాయ్" సినిమాలో నటించినట్టు చెబుతున్నారు. అలానే ర్యాట్ ఇన్ ద కిచెన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి.. ఉత్తమ సహాయ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. వివేక్ ఒబెరాయ్‌తో పోస్టర్‌లో ఐశ్వర్య దేశాయ్‌ని కలిపి విడుదల చేయడంతో స్పిరిట్‌లో ఆమె పాత్ర బలంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ఒక్క పోస్టర్‌తో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్స్ కూడా ఆమె ఫోటోలను తెగ షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇక వివేక్ ఒబెరాయ్ 2002లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'కంపెనీ' సినిమాతో తెరంగేట్రం చేశారు. 'రక్త చరిత్ర' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలానే తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలో విలన్ గా నటించిన ఆయన.. ఇప్పుడు 'స్పిరిట్' తో మరోసారి ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. మరోవైపు 'స్పిరిట్' చిత్రంలో కొరియన్ నటుడు డాన్ లీ విలన్ గా కనిపిస్తారని చాలాకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
And that’s @vivekoberoi from #Spirit 🔥
— Spirit (@InSpiritMode) February 27, 2026
In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar @ShivChanana @neerajkalyan_24… pic.twitter.com/U98fxyH7Yv
-
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు











Click it and Unblock the Notifications