Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'గ్రే డైవోర్స్' తీసుకుంటున్న ఐశ్వర్యరాయ్-అభిషేక్‌బచ్చన్?

కొన్నాళ్లుగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ జంట గురించే సోషల్ మీడియాలో వార్తలు. వారిద్దరూ విడిపోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనేది ఆ వార్తల సారాంశం. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అభిషేక్ నో కామెంట్ అని బదులివ్వడంతోపాటు తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించాడు. అంటే ఇప్పటికీ తామిద్దరం కలిసివున్నామనేది దాని అర్థం. అయితే ఈనెల రెండోతేదీన ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు. ఆరోజు ఆమెకు అమితాబ్ బచ్చన్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో కచ్చితంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనేది ఖరారైందంటున్నారు.

బాలీవుడ్ లో మంచి మంచి జంటగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య-అభిషేక్ గ్రే డైవర్స్ తీసుకోబోతున్నారంటున్నారు. ఎందుకంటే విడాకుల వార్తల్లో ఉన్న నిజనిజాలను కూడా వీరిద్దరూ ఖండించలేదు. వాస్తవానికి గ్రే డైవర్స్ అనేది విదేశాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే మనదేశంలోని ప్రధాన నగరాల్లో విస్త్రతంగా వ్యాపిస్తోంది. 50 సంవత్సరాల వయసు దాటినవారు గ్రే డైవర్స్ తీసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. తమ దాంపత్య జీవితం ఇంతటితో చాటు.. ఇక ముగిద్దామనే నిర్ణయానికి వస్తారు. వృద్ధాప్యంలో జీవితంలో మార్పుల కోసం, పరిపూర్ణత సాధించడం కోసం వీటిని తీసుకుంటున్నారు.

aishwarya Rai and abhishek Bachchan taking Grey Divorce

ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ గొప్పదనం గురించి తెలిసిందే. మరణించేవరకు భార్యాభర్తలిద్దరూ కలిసివుంటారు. ఎన్ని మనస్పర్థలు వచ్చినా చివరి వరకు అలాగే ఒకర్నొకరు సర్దుకుపోయి జీవిస్తుంటారు. అయితే మహిళల్లో రోజురోజుకు ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతుండటంతో వారి భావాలు మారిపోతున్నాయి. ఆర్థికంగా తమ జీవిత భాగస్వామిపై ఆధారపడాల్సిన అవసరంలేదు. అలా ఆధారపడినప్పుడు అణిగిమణిగి జీవించాల్సి ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. స్వేచ్ఛగా, ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించాలనుకునే మహిళలు ఎక్కువగా గ్రే డైవర్స్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+