హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్.. ఆ స్టార్ హీరో డేరింగ్ నిర్ణయం..!

హైదరాబాద్ మహానగరం మూవీస్ కు అడ్డాగా మారుతోంది. అటు సినిమా షూటింగ్స్ అయినా.. ఈవెంట్స్ అయినా ప్రీ- రిలీజ్, సక్సెస్ మీట్స్ అయినా హైదరాబాద్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారుతోంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మూవీ లవర్స్ అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే హైదరాబాద్ లో అనేక మల్టీప్లెక్స్ లు వెలిశాయి. హైదరాబాద్‌ లో ప్రసాద్స్, పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, ఏఎంబీ సినిమాస్ వంటి అనేక ప్రముఖ మల్టీప్లెక్స్‌ లు మనకు కనిపిస్తాయి.

ఈ మల్టీప్లెక్స్ లను అత్యాధునిక టెక్నాలజీతో తీసుకొచ్చారు. డాల్బీ ఎట్మాస్ సౌండ్, హెచ్ డీ ఫోర్ కే స్క్రీన్‌ లు, విలాసవంతమైన సీటింగ్, ఫుడ్ కోర్టులతో లగ్జరీ సినిమా అనుభవాన్ని అందిస్తున్నాయి. మరోవైపు సినిమా హీరోలు మూవీస్ తో పాటు థియేటర్స్ బిజినెస్ లోకీ అడుగుపెట్టారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్, ఇటీవల మాస్ మహారాజ రవితేజ.. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఏఆర్ టీ సినిమాస్ ను ప్రారంభించారు.

అయితే తాజాగా హైదరాబాద్ లో మరో స్టార్ హీరో తన మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ .. త్వరలోనే కర్మాన్‌ఘాట్‌ లో 'దేవ్‌గణ్ సినీ-ఎక్స్' పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌ ను ప్రారంభించనున్నారు. ఇదే విషయంపై ఇప్ప‌టికే ఆయ‌న ప‌లుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ ప‌రంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

Ajay Devgn Brings Bollywood Magic to Hyderabad Launches Devgn Cine-X Multiplex

ఇక ఇప్పటికే అజయ్ దేవ్ గణ్.. గురుగ్రామ్ లో దేవ్ గణ్ సినీ- ఎక్స్ పేరుతో ప్రారంభమై మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. దీంతో అజయ్ దేవ్ గణ్ దేశవ్యాప్తంగా 'దేవ్ గణ్ సినీ-ఎక్స్' పేరుతో మల్టీప్లెక్స్ స్క్రీన్‌ లను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ను వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో నిర్మించనున్నట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+