మెంటల్ మాస్ లుక్‌లో అక్కినేని హీరో..అయ్యగారి నుంచి ఇది అసలు ఊహించలేదే
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఆప్డేట్ బయటకు వచ్చింది.అఖిల్ చివరిగా నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఏజెంట్ సినిమా వచ్చి రెండేళ్లు అయినప్పటికీ, అఖిల్ తన తర్వాత సినిమాను అనౌన్స్ చేయలేదు.ఇప్పటివరకు అక్కినేని అఖిల్ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. అయితే పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పాడు అఖిల్.
తన కొత్త సినిమా ఆప్డేట్‌పై బిగ్ అనౌన్స్‌మెంట్ చేశాడు అఖిల్. అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'లెనిన్'. ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో "వినరో భాగ్యము విష్ణు కథ" సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో అఖిల్‌తో పాటు శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వీరిద్దరికీ కలిసి మొదటి సినిమా. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై మరియు నాగ వంశీ, సాయి సౌజన్యలు కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇది ఒక యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది. విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో అఖిల్ చాలా పవర్ఫుల్ మరియు ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు.కథ రాయలసీమ నేపథ్యంలో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతంలో జరుగుతుందని సమాచారం. అఖిల్ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడని తెలుస్తోంది.సినిమా చివర్లో "నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దెన్ లవ్" అనే ట్యాగ్‌లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది.ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఈరోజు (ఏప్రిల్ 8, 2025) అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. ఇది చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందని టాక్ వస్తోంది. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ కొడతాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.












Click it and Unblock the Notifications