పవన్ కల్యాణ్ కొడుకు కూడా ప్రభాస్ ఫ్యానే..కల్కి థియేటర్‌లో అకీరా రచ్చ

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మించారు. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకునే, అమీతాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను కల్కి ఆకట్టుకునేలా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో కల్కిపై పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.

Akira Nandan special attraction kalki movie

కల్కి హిట్ కావడంతో మంత్రి నారా లోకేష్ సైతం ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారాయన. ఇక కల్కి సినిమాను పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కుటుంబంతో కలిసి చూశారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్‌లో రేణు దేశాయ్ తన కుటుంబంతో కలిసి కల్కి మూవీని చూడటం జరిగింది. మేమంతా కల్కి అభిమానులం. చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ అరిచి గోల చేసాం.

కనీసం ఒక వారం రోజులైనా మా గొంతు పనిచేయవేమో. ఈ రోజు ఉదయమే కల్కి మార్నింగ్ షో చూశాం. మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి వెళ్లి ఖచ్చితంగా కల్కి సినిమా చూడండి.. అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. 'కల్కి'టీ షర్ట్ ధరించి అకీరా థియేటర్‌లో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ కొడుకు కూడా ప్రభాస్ ఫ్యానే అంటూ అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+