శోభితతో నిశ్చితార్థం... నక్క తోక తొక్కిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య కొద్దిరోజులుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయి శోభిత ధూళిపాళతో ఈనెల 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చిలో చేయనున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేడుక నిర్వహించేందుకు ప్రదేశాలను వెదుకుతున్నారు. ఇక్కడ కుదరకపోతే పారిస్ లో వీరి వివాహం చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు.
శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగచైతన్యకు అదృష్టం కలిసివచ్చిందంటున్నారు. చైతూకు మొదటి నుంచి ఫార్ములా వన్ రేస్, కారు రేసింగ్స్ అంటే మహా పిచ్చి. చాలా సందర్భాల్లో తనకు ఎంతో ఇష్టమై రేసింగ్ కార్లతోపాటు మోటార్ సైకిల్స్ ను సేకరిస్తుంటాడు. తాజాగా ఆయన తనకు ఎంతో ఇష్టమైన రంగంలోకి అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో చాలా జట్లు పోటీపడుతుంటాయి. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగచైతన్య దక్కించుకున్నారు. దీంతో ఆయన ఐఆర్ఎఫ్ ఫార్ములా4లో భాగమయ్యారు.

చిన్నతనం నుంచి తనకు మోటారు సైకిల్స్, కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని, ఫార్ములా వన్ లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నపడటంలో ఉండే థ్రిల్ బాగా అనుభవిస్తానన్నారు. తన ఫ్యాషన్ ను చూపించుకునేందుకు ఇది సరైన వేదిక అని భావిస్తున్నట్లు నాగచైతన్య అన్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ను సొంతం చేసుకోవడంవల్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ మరో రేంజ్ కు చేరుకుంటుందని, ఎంతోమందిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందన్నారు. అభిమానులకు ఐఆర్ఎఫ్ అనేది జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications