ఎదుటివారు చెప్పేది వినదు... అందుకే జీవితంలో ఎవరూ లేరు: నాగచైతన్య
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తండేల్ సినిమా షూటింగ్ చేస్తూనే.. మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. దీంతో చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ దీనికి దర్శకుడు. డిసెంబరు 1వ తేదీ నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు, హిందీ భాషల్లో కూడా చై ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నాడు. తాజాగా.. సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక NM తో కలిసి క వీడియో చేశాడు. నిహారిక గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా, ఇన్ఫ్లుయెన్సెర్ గా ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. అడవి శేష్, మహేష్ బాబు తో కలిసి వీడియోలు చేశారు. ప్రస్తుతం చై నిహారికతో కలిసి వీడియో చేశాడు.

దూత సినిమా గురించి నాగచైతన్య మాట్లాడుతుంటుంటే . నిహారిక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఆమెను కొద్దిసేపు సైలెంట్ గా ఉండమంటాడు. దూత సినిమాలో తాను ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నానని, తన పేరు సాగర్ అని చెబుతుండగా సాగర్ ఎవరు.. ? దూత అంటే ఏంటి అంటూ నిహారిక విసిగిస్తూ ఉంటుంది.
దీంతో విసిగిపోయిన చై.. నీకు వినే ఓపిక లేదు.. అందుకే నీ లైఫ్ లో ఎవరు లేరు అనగానే నిహారిక చిన్నబుచ్చుకుంటుంది. వెంటనే చై.. ఆమెకు సారీ చెప్పి .. మళ్లీ సిరీస్ గురించి మాట్లాడుతుంటాడు. దూత 2 లో నిహారికకు క్యారెక్టర్ ఆఫర్ చేస్తాడు. అయినా కూడా నిహారిక డిస్ట్రబ్ చేయడంతో చై అక్కడనుంచి కోపం గా వెళ్ళిపోతాడు. దూత2లో తానుంటానని, డిసెంబరు 1న వచ్చే దూత చూడండి అని నీహారిక చెప్పడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications