ఈసారి ఆ గోల్డెన్ లెగ్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న అక్కినేని హీరో..?
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చాలా కాలం తర్వాత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి 'తండేల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. హిట్ అవ్వడం ఒకటి అయితే రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోవడం అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటిస్తున్నాడు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో చైతన్య మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది. నాగ చైతన్య సరసన ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హీరో, హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభించారని అంటున్నారు. గతేడాది చివర్లో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో వెంకీ మామకి అదిరిపోయే హిట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అల్లుడు చైతన్యకి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిర్మాతగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కు పెద్దగా కలిసి రావడం లేదు. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. వారి ప్రొడక్షన్ లోనబె రీసెంట్ గా వచ్చిన జాక్ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో నిర్మాతగా ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రసాద్.
ఇక ఇప్పటికే చందు - చైతన్య కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. హ్యట్రిక్ గా వచ్చిన తండేల్ భారీ హిట్ అందుకోవడంతో.. నాగ చైతన్యతో ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు అనౌన్స్ చేశాడు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు.
-
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!












Click it and Unblock the Notifications