సమంతకు బిగ్ హెల్ప్ చేసిన నాగచైతన్య?
తెలుగులో స్టార్ కథానాయికగా రాణిస్తోన్న సమంత మయోసైటిస్ కోసం విదేశాల్లో చికిత్స తీసుకుంది. త్వరలోనే ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను పలకరించాలనే ఉద్దేశంతో ఉంది. నాగచైతన్యతో వివాహానికి ముందు ఎంత పేరు తెచ్చుకుందో విడాకుల తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. చిన్న చిన్న సమస్యలవల్లే వీరిద్దరూ విడిపోయారుకానీ ఇప్పటికీ నాగచైతన్య అంటే సమంతకు, సమంతకు నాగచైతన్య అంటే పిచ్చి ప్రేమ అని పరిశ్రమలో చెబుతుంటారు.
నాగచైతన్య పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమంత ఎక్స్ ప్రెషన్స్ కానీ, సమంత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నాగచైతన్య ఎక్స్ ప్రెషన్స్ కానీ మనం అర్థం చేసుకుంటే వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి బయటకు కనపడనంత ప్రేమ ఉందంటారు. వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఇద్దరిపై నిందలు వేశారు. కొన్ని ఇంటర్వ్యూల్లో సమంత కూడా పరోక్షంగా నాగచైతన్యపై కోపాన్ని వ్యక్తంచేసిందికానీ నాగచైతన్య మాత్రం ఈరోజు వరకు ఎక్కడా సమంత గురించి చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. ఒకరకంగా ఆమెకు మద్దతిస్తూనే పరోక్షంగా మాట్లాడేవాడు.

తెరపై తన పర్ ఫెక్ట్ కెమిస్ట్రీ సమంత అని, ఆమె ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అని పరోక్షంగా ఆమెపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశాడు. కాఫీ విత్ కరణ్ షోలో సమంత పరోక్షంగా నాగచైతన్య పై ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలోను నాగచైతన్య సమంత గురించి పాజిటివ్ గానే స్పందించాడుకానీ ఆమెగురించి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. ఒకరకంగా తనకు తెలియకుండా సమంతకు కావల్సినంత సహాయం చేశాడని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య చాలా మంచివ్యక్తి అని అర్థమవుతోందని, అనవసరంగా చిన్న చిన్న స్పర్థలను పట్టించుకోకుండా ఉంటే సంతోషంగా కలిసివుండేవారంటున్నారు. భవిష్యత్తులోనైనా వీరిద్దరూ కలుస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications