'అక్కినేని' ఇంట్లో ఒకేసారి మూడు పెళ్లిళ్లు?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ పరిశ్రమలో ఉన్నారు. అలాగే మరో వారసుడిగా ప్రవేశించిన సుమంత్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సుశాంత్ కూడా నటిస్తున్నారు. నాగార్జున మేనకోడలు సుప్రియ పవన్ కల్యాణ్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత నిర్మాతగా కొనసాగుతోంది.

బాధపడుతున్న నాగార్జున
నాగచైతన్య సమంతను ఏడు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల కాపురం తర్వాత అకస్మాత్తుగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారుకానీ తాను సినిమాలమీదే దృష్టి పెట్టాలనని చైతూ తండ్రికి చెబుతున్నారు. మరో కొడుకు అఖిల్ కు శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరిగింది. తర్వాత వీరి వివాహం మాత్రం జరగలేదు. నాగచైతన్య వివాహంకానీ, అఖిల్ నిశ్చితార్థం కానీ నాగార్జున ఘనంగా జరిపారు. అయితే వీరిద్దరికీ పెళ్లిళ్ల విషయంలో ఇలా జరగడంతో ఆయన బాధపడుతున్నారు.

akkineni Nagarjuna decided to marry Naga Chaitanya and Akhil

జీవితంలో స్థిరపడతారనే ఉద్దేశంతో..
మరోవైపు సుమంత్ కూడా కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. షరామాములుగానే వీరు కూడా విడిపోయారు. మేనకోడలు సుప్రియకు కూడా వివాహం జరిగిందికానీ ఆమె కూడా భర్తతో విడిపోయింది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో పెళ్లిళ్లు ఎవరికీ కలిసి రాలేదా? ఏంటి.. ఇలా అయింది.. అంటూ రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఒక తండ్రిగా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే వస్తున్నారు నాగార్జున. అయితే ఇటువంటి సమయంలో మళ్లీ పెళ్లి చేస్తే నాగచైతన్య జీవితంలో స్థిరత్వం వస్తుందని, అలాగే అఖిల్ కూడా ఎదుగుతాడని నాగార్జున భావిస్తున్నారు.

అఖిల్ కు సంబంధం చూసిన నాగార్జున
ప్రస్తుతం వీరిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో కింగ్ తలమునకలైవున్నారు. వీరిద్దరికీ వివాహాలు జరిగిన తర్వాత సుమంత్ కు కూడా చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నారు. నాగచైతన్యకు తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే అఖిల్ కు ఓ అమ్మాయిని చూశారు. వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. వారి వ్యక్తిగత జీవితాలను దారిలోపెట్టాలని నాగార్జున గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే ఆశతో అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+