అక్కినేని నాగార్జునకు తప్పిన భారీ ప్రమాదం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతుండటంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ జిల్లాలోని పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతోపాటు పలు లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి.

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు కింగ్ నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు.

akkineni nagarjuna escaped from a huge accident

వరదల్లో చిక్కుకుపోవడంతో..
ఈరోజు నాగార్జున ఓ జ్యూయలరీ షాపు ప్రారంభానికి అనంతపురం వచ్చారు. అయితే మార్గమధ్యంలోనే ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి విమానంలో వచ్చిన నాగార్జున అనంతపురం వస్తుండగా వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన జ్యూయలరీ షాపు యాజమాన్యంతోపాటు ఆయన అనుచరులు అక్కడి నుంచి మరో మార్గంలో అనంతపురానికి జాగ్రత్తగా తీసుకువచ్చారు. దీంతో నాగార్జునకు పెను ప్రమాదం తప్పినట్లైందని ఆయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

akkineni nagarjuna escaped from a huge accident

నీటి గండం ఉందా?
తనకు నీటి గండం ఉందని, నీరు అంటే భయమని మన్మథుడు సినిమాలో నాగార్జున అంటారు. ఇటీవలే చెరువును ఆక్రమించి కట్టారంటూ మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా అనంతపురం వెళుతుండగా వరదల్లో చిక్కుకోవడంతో నాగార్జునకు నీటి గండాలు ఎదురవుతున్నాయని, అక్కినేని కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోందంటున్నారు. కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై నాంపల్లి కోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తూ అక్కినేని కుటుంబాన్ని కుడా కొండా సురేఖ రాజకీయ బురదలోకి లాగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+