శుభవార్త చెప్పిన అక్కినేని ఫ్యామిలీ..
అక్కినేని కుటుంబం ప్రస్తుతం మంచి సంతోషంగా ఉంది. దీనికి కారణం నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యకు శోభితతో వివాహం జరగడంతోపాటు ఇటీవలే విడుదలైన తండేల్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. నాగచైతన్యకు మొదటి రూ.100 కోట్ల సినిమా ఇది. శోభితను చూసుకున్న తర్వాత అంతా కలిసివస్తోందనే సంతోషంలో అక్కినేని కుటుంబం ఉంది. తర్వాత చిన్న కొడుకు అఖిల్ కు బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అఖిల్, ఆ అమ్మాయి జైనబ్ రబ్జీ ముందుగానే ప్రేమించుకోవడంతో వారి ప్రేమకు ఇరువైపులా పెద్దలు అంగీకారం తెలిపారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడంతోపాటు కుటుంబ సభ్యులంతా మోడీతో కొంత సమయం ఆహ్లాదకరంగా గడిపారు.
అంగరంగ వైభవంగా జరపాలని
పెద్దకొడుకు భారీ హిట్ సాధించిన తర్వాత చిన్న కొడుకు కూడా అంత హిట్ ఇవ్వాలని నాగార్జున కోరుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కలిసివస్తుందనే అభిప్రాయంతో మార్చి 24వ తేదీన అఖిల్ - జైనబ్ రబ్జీ వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. వీరిద్దరి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయనేతలు, క్రికెటర్లు.. ఇలా తనకు పరిచయమున్న ప్రతి సెలబ్రిటీని ఆహ్వానించి వివాహాన్ని నభూతో నభవిష్యతి అన్నరీతిలో చేయాలని నాగార్జున సన్నాహాలు చేసుకుంటున్నారు.

కొంతకాలంగా డీలా పడిన అక్కినేని
ప్రస్తుతం అఖిల్ పెళ్లికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. అఖిల్ ప్రస్తుతం సీసీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. దీనితర్వాత ఒక సినిమా ప్రారంభం కాబోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానరుపై ఇప్పటికే ఒక సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. వివాహమైన తర్వాత పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా అఖిల్ నిలదొక్కుకుంటాడని నాగార్జున భావిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కినేని కుటుంబం మాత్రం చాలాకాలం తర్వాత సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో సరైన హిట్లు లేక, సమంతో విడిపోవడం, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. తదితర కారణాలతో అక్కినేని కుటుంబం కాస్తంత డీలా పడింది. ఇప్పుడు అఖిల్ వివాహంతో ఈ కుటుంబంలో సంతోషం వెల్లివిరియబోతోందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications