'నా సామిరంగ' రివ్యూ: టాప్ లేపిన నాగార్జున

నటీనటులు నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, నాజర్, రావు రమేష్, రుక్సర్ థిల్లాన్, మధుసూదనరావు తదితరలు నటించిన ఈ చిత్రంద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కీరవాణి సంగీతాన్ని అందించగా, ప్రసన్నకుమార్ మాటలు అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

తమ్ముడు లాంటి అంజి (నరేష్), తండ్రి లాంటి ఊరిపెద్ద (నాజర్)కి కిష్టయ్య (నాగార్జున) అండగా నిలబడతాడు. సొంత కొడుకులైన తమకంటే కిష్టయ్యకే ఎక్కువ విలువ ఇవ్వడాన్ని దాసు కొడుకులు (షబ్బీర్) తట్టుకోలేకపోతారు. వీరి మధ్య వివాదం చంపుకోవడం వరకు వెళుతుంది. ఆషికా రంగనాథ్ పాత్ర ఈ చిత్రంలో ఏమిటి? ప్రత్యర్థులపై నాగార్జున ఎలా విజయం సాధించాడు అనేవాటికి సమాధానమే నా సామిరంగ.

akkineni nagarjuna movie naa samiranga review

అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగ కలిసొస్తోంది. గోదావరి యాసలో, పంచెకట్టులో ఆయన స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంది. ఈ సినిమాలో నాగార్జున రగ్గడ్ లుక్ లో నాటుగా కనిపించారు. దీనివల్ల మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. ఆషికా రంగనాధ్ హుందాగా వయసుకు మించిన పాత్రలో ఒదిగిపోయింది.

ఒకరకంగా ఆమె గ్లామర్ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. నరేష్ మరోసారి బాగా ఆకట్టుకున్నాడు. నవ్వించడంతోపాటు ఏడిపించాడు. రాజ్ తరుణ్ పాత్ర ఎలివేట్ కాలేదు. తమిళ నటుడు షబ్బీర్ విలనిజం అద్భుతంగా ఉంది. దర్శకుడు అతడి క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశాడు. భవిష్యత్తులో తెలుగులో పెద్ద విలన్ గా ఎదిగే అవకాశాలు కనపడుతున్నాయి.

akkineni nagarjuna movie naa samiranga review

కీరవాణి సంగీతం సినిమాకు ప్రధాన బలం. ప్రతి సన్నివేశాన్ని ఆయన బాగా ఎలివేట్ చేశారు. పాటలు సందర్భానుసారంగా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ విభాగం మంచి పనితీరును కనపరిచాయి. భావోద్వేగ సన్నివేశాలు దర్శకుడు బాగా తెరకెక్కించాడు. అల్లరి నరేష్ కామెడీని కూడా బాగా ఉపయోగించుకున్నాడు. కథకుడిగా, దర్శకుడిగా మంచిపేరు సంపాదించుకున్నాడు విజయ్ బిన్నీ. సంక్రాంతి పండగకు గ్రామీణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. కామెడీతోపాటు యాక్షన్ పుష్కలంగా ఉంది. సంక్రాంతి పండగకు హనుమాన్ తర్వాత నా సామిరంగ సెకండ్ ఆప్షన్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+