దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా అక్కినేని నాగార్జున

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన్మథుడు అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు మన్మథుడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఆయన దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియో అధినేతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడరల్ గా, సినిమాల్లో హీరోగా, నిర్మాతగా విభిన్నరంగాల్లో రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తండ్రి అందించిన వారసత్వ వ్యాపారంతోపాటు తాను సొంతంగా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కలుపుకొని దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా నిలిచారు.

దేశంలోనే తొలిసారిగా అన్నపూర్ణలో
ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే నాగార్జున చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమాలు కూడా తక్కువగా చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువగా దృష్టిపెడతారు. దీంతోపాటు ఇతర వ్యాపారాలపై కూడా. సినిమాలకు రూ.10 కోట్లు తీసుకునే నాగార్జున, వాణిజ్య ప్రకటనలకు రూ.3 కోట్లు తీసుకుంటారు. దీంతోపాటు ఆయన బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తే దాని పారితోషికం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించారు. దేశంలో ఈ సౌకర్యం ఉన్న తొలి స్టూడియో ఇదే కావడం విశేషం.

akkineni nagarjuna total property value details herec

ప్రపంచస్థాయి సాంకేతికత అందిస్తున్నారు
స్టూడియోలో ఫిల్మ్ స్కూల్ నడుస్తోంది. అన్నపూర్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రపంచస్థాయి సాంకేతికతతో కూడిన ప్రమాణాలను సినిమా రంగానికి అందిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్, హోటల్స్, పబ్స్.. తదితర వ్యాపారాలద్వారా కోట్లరూపాయలు కూడబెడుతున్నారు. ఆయనకు సొంతంగా జెట్ ఉంది. అత్యంత విలాసవంతమైన, అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. వీటితోపాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అధికారికంగా ఇంత అని చెప్పకపోయినప్పటికీ అనధికారికంగా వేలకోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నారు. సినిమా హీరోల్లో ఇంత ఆస్తిని కలిగినవారు భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురుకి మించి ఉండకపోవచ్చని అంచనా. అక్కినేని నాగార్జున మైండ్ చాలా షార్ప్ గా ఉంటుందని, అతనిది బిజినెస్ మైండ్ అని, చాలా గొప్పగా ఆలోచిస్తారని, డబ్బును ఆర్జించడంలో ఆయన్ను మించినవారు లేరని నాగార్జున సన్నిహితులు చెబుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+