స్టార్ క్రికెటర్‌తో చిందేసిన అక్షయ్ కుమార్.. వీడియో వైరల్..
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ స్టార్ క్రికెటర్ శికర్ ధావన్‌తో కలసి చిందులేసారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) కలసి నటిస్తున్నసినిమా 'బడే మియాన్ చోటే మియాన్'.
ఈ సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ వినూత్న పద్ధతిలో సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే టైగర్ ష్రాఫ్ తన అభిమానులు, తోటి నటులకు #GoMastMalangJhoom ఛాలెంజ్ ఇచ్చారు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా 'బడే మియాన్ చోటే మియాన్' నుంచి రిలీజ్ అయిన 'మస్త్ మలాంగ్ ఝూమ్' పాటకు డ్యాన్స్ చేయాలని టైగర్ ష్రాఫ్ కోరడం జరిగింది. ఇక, ఈ ఛాలెంజ్‌ను తాజాగా యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్వీకరించాడు.
ప్రముఖ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తో కలిసి 'మస్త్ మలాంగ్ ఝూమ్' పాటకు అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ డ్యాన్స్ వీడియోను అక్షయ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ సినిమాలోని సహా నటులయిన సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్‌తోపాటు స్టార్ నటి కత్రినా కైఫ్‌కు కూడా అక్షయ్ ఈ ఛాలెంజ్‌ను విసిరాడు.
నాటు నాటు స్టెప్పును రీక్రియేట్ చేసిన అక్షయ్, టైగర్ ష్రాఫ్
బడే మియాన్ చోటే మియాన్ సినిమాలోని'మస్త్ మలాంగ్ ఝూమ్' పాటను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ పాటలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా నటించారు. ఈ పాట మధ్యలో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్‌లు 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని నాటు నాటు స్టెప్పును రీక్రియేట్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాఫిక్‌గా మారింది. ఇది చూసిన పలువురు నెటిజన్లు, అభిమానులు 'నాటు నాటు..' స్టెప్పులను వారి సినిమాలో కాపీ కొట్టారంటూ బాలీవుడ్ స్టార్ హీరోలను ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications