నా కూతురుని ఒంటిపై బట్టలు లేకుండా ఫోటోలు అడిగారు - స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ సైబర్ అనుభవం గురించి ఓపెన్ అయ్యారు. ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక అపరిచితుడు ఆమెకు అసభ్య ఫోటోలు పంపమని కోరినట్టు వెల్లడించారు. ఈ తరహా ఘటనలు సైబర్ నేరాలు వీధి నేరాల కంటే మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరాలను సైతం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో పిల్లలకు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలని అభ్యర్ధించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అటు సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతోంది.

సంఘటన ఎలా జరిగింది?
కొన్ని నెలల క్రితం, అక్షయ్ కుమార్తె ఒక వీడియో గేమ్ ఆడుతూ.. తెలియని వారితో కలిసి ఆడే అవకాశం పొందింది. ఆ సమయంలో ఆ వ్యక్తి "నువ్వు అబ్బాయా, అమ్మాయా?" అని అడిగాడు. కుమార్తె 'అమ్మాయి' అని సమాధానం ఇచ్చిన వెంటనే, ఆ వ్యక్తి 'నీ న్యూడ్ ఫోటోలు పంపగలవా?' అని అడిగాడు. దాంతో ఆమె వెంటనే గేమ్ ఆపేసి.. విషయాన్ని తల్లికి వివరించింది.
పిల్లల భద్రతపై ప్రత్యేక ఆందోళన
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారులు అవగాహన లేకుండా ఈ నేరాలకు లక్ష్యం కావచ్చని వ్యాఖ్యానించారు. సైబర్ నేరాలపై తక్షణ చర్యలు అవసరమని, పిల్లల భద్రతను ప్రథమ స్థానంలో ఉంచి, పాఠశాలల్లో సైబర్ భద్రతా అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా సులభంగా లక్ష్యం కావచ్చని స్పష్టం చేశారు. అంతే కాకుండా తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలపై కూడా పర్యవేక్షణ ఉంచాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే అధికారులు, పోలీసులను సంప్రదించాలని సూచించారు.
#WATCH | Mumbai | Actor Akshay Kumar says, "I want to tell you all a small incident which happened at my house a few months back. My daughter was playing a video game, and there are some video games that you can play with someone. You are playing with an unknown stranger. While… pic.twitter.com/z9sV2c9yC6
— ANI (@ANI) October 3, 2025
మరోవైపు అక్షయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గత సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాపులవుతున్నాయి. సామ్రాట్ ప్రతాప, రక్షాబంధన్, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, హౌస్ ఫుల్ 5 లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 'కేసరి చాప్టర్ 2' తో హిట్ అందుకోగా.. తెలుగులో కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications