అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు రోయ్.. బాక్సాఫీస్ ను షేక్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో వరుస హిట్స్ తో దూసుకెళ్లారు. కానీ ఇటీవలి కాలంలో సరైన హిట్టు లేక ఇబ్బందిపడ్డారు. అలాంటి సమయంలో ఆయన మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ ఇటీవల నటించిన 'బూత్ బంగ్లా' మూవీ భారీ విజయం సాధించింది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. రణ్ వీర్ సింగ్ ధురంధర్-2 సినిమాను తట్టుకుని మరీ ఈ మూవీకి కలెక్షన్స్ పెరగడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్నాళ్లో వేచిన హిట్ ను ఎట్టకేలకు అక్షయ్ కుమార్ సాధించారంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా మూవీ మన దగ్గరే కాకుండా అటు ఓవర్సీస్ లనూ దూసుకెళ్తోంది. ఏప్రిల్ 18 న ఈ మూవీ రిలీజ్ కాగా.. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే 3 మిలియన్ మార్కును దాటింది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఈ మూవీ రూ. 150 కోట్ల క్లబ్ లోకి చేరడం చాలా ఈజీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ వైపు రిలీజ్ అయి నెల రోజులు దాటినా ధురంధర్ 2 మూవీకి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బూత్ బంగ్లా మూవీ ఈ స్థాయిలో విజయం సాధించడం గ్రేట్ అని అంటున్నారు.

ఇక అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కు మినిమం గ్యారంటీ ఫిల్మ్ అని మరోసారి రుజువైంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు. అలాగే బూత్ బంగ్లా చిత్రంలో వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications