కూతుళ్లపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా తనదైనశైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కోల్‌కతాలో జునియర్ డాక్టర్‌పై అత్యాచార ఘటనపై రియాక్ట్ అయ్యారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ ఒకటి పెట్టారు.
''ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడటానికి ప్రయత్నించలేదు. నా హక్కుల కోసం పోరాటం చేయలేదు. కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు గళం విప్పుతున్నాను. మహిళలపై అత్యాచారాలు జరగడం సహించకూడదు.రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మన చట్టం. దేశంలో మీరు పోరాడలేకపోతే కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడండి. సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్. ఆ పని నేను చేస్తాను. మీరు చేయగలరా?'' అని ప్రశ్నించింది. ఆలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్‌పై కొందరు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

ఇక అలేఖ్య రెడ్డి వ్యక్తిగత జీవితానికి వస్తే.. తారకరత్న మరణంతో ఆమె ఒంటరైయ్యారు. అలేఖ్య, నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కులాలు వేరు కావడంతో అలేఖ్య రెడ్డి, తారకరత్నను నందమూరి కుటుంబం చేరదీయలేదు. దీంతో తారక్ తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు కూడా జన్మించాడు.
తన కుటుంబంతో తారకరత్న అప్పుడప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అంతా బాగుందనుకునేలోపే తారకరత్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల్లో ఎటువంటి మార్పు రాలేదని తెలుస్తోంది. అలేఖ్య సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబం నుంచి తనకు ఎటువంటి ఆదరణ లేదని ఆమె చెప్పడం జరిగింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications