'గుంటూరు కారం' థియేటర్లన్నీ హనుమాన్ కే!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలై మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టడానికి మహేష్ బాబు ప్రయత్నించారుకానీ సినిమా అన్న తర్వాత ఇతర హంగులు కూడా అవసరమేగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రైటింగ్ తో ఈ సినిమా మహేష్ బాబు అభిమానులనే కాదు.. సినీ ప్రియుల అంచనాలను కూడా అందుకోలేక బొక్కబోర్లా పడింది.
ఉదయం ఆట నుంచే వస్తున్న ఈ నెగెటివ్ టాక్ సినిమాపై బలంగా పడింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ అవుతుందని, సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా సినిమా ఆడుతూనే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నమ్మకంతోనే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలాంటి నగరాల్లో బుక్ మై షో యాప్ లో టికెట్స్ మొత్తం బ్లాక్ చేశారు.

సినిమా విడుదలైన తర్వాత టాక్ నెగెటివ్ గా ఉండటంతో టిక్కెట్లు అమ్ముడుపోకపోవడంతో వాటిని మళ్లీ బుక్ మై షోలో పెట్టేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతోపాటు విడుదలైన 'హనుమాన్' చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ ప్రభావం గుంటూరు కారంపై స్పష్టంగా కనపడుతోంది. ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్నవారు వాటిని రద్దుచేసుకొని హనుమాన్ చిత్రానికి బుక్ చేసుకుంటున్నారు. బుక్ మై షోలో 'హనుమాన్' చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. 'గుంటూరు కారం' చిత్రానికి కేవలం 16 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. రేపటి నుంచి హనుమాన్ కు కేటాయించిన థియేటర్లన్నింటినీ హనుమాన్ చిత్రానికి ఇచ్చేస్తున్నారు.












Click it and Unblock the Notifications