చిరంజీవి ఊసే ఎత్తని అల్లు అర్జున్..ఆయన వల్లే స్టార్ అయ్యానంటూ కౌంటర్
మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈక్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు. అటు వైసీపీ అభిమానులు సైతం అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఈ వైరాన్ని మరింత పెంచినట్టు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తాజాగా ముంబయ్‌లో 'పుష్ప-2' హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల క్రితమే ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడని తెలిపారు.
అయితే తనకు తొలి నుంచి అండగా నిలిచిన మెగాస్టార్ పేరు ప్రస్తావించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. వేదికను బట్టి చిరంజీవి గురించి మాట్లాడతారని, అక్కడ పుష్ప-2కు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడారని అల్లు అభిమానులు చెబుతున్నారు. బాలకృష్ణ షోలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల గురించి అల్లు అర్జున్ పాజిటివ్‌గానే మాట్లాడరనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి మరోసారి అల్లు అర్జున్ వ్యాఖ్యలతో మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications