అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులా..? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం
తెలుగు ఇండస్ట్రీకిలో అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా మొదటితరంలో అల్లు రామలింగయ్య కమెడియన్‌గా రాణించారు. విలన్ల పక్కనే ఉంటూ ఆయన చేసే కామెడీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అల్లు అరవింద్ ఇచ్చిన అండగా చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు.అల్లు రామలింగయ్య కుమారుడుగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
గీతా ఆర్ట్స్ పేరిట మీద ఆయన చిత్రాలు నిర్మిస్తున్నారు. చాలామంది అల్లు అరవింద్‌కు ఇద్దరు కుమారులే అని అనుకున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే అల్లు అరవింద్‌కు కుమారులు అని అనుకున్నారు. అల్లు అరవింద్‌కు అల్లు వెంకటేష్ అనే పెద్ద కుమారుడు ఉన్నారు. ఆయన కొద్దికాలం క్రితమే అల్లు వెంకటేష్ వివాహం జరిగింది. అయితే అల్లు అరవింద్‌కు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ బయటపెట్టారు. అల్లు శిరీష్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.

తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ చెప్పాడు. అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. ఇలా మా నాన్నకు నలుగురు సంతానం. తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించారు. అల్లు రాజేష్ చిన్న వయస్సులోనే మరణించడంతో తన గురించి ఎక్కడా చెప్పుకోలేదని అల్లు శిరీష్ తెలిపారు. అల్లు వెంకటేష్ సినిమాలకు దూరంగా ఉండగా, అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2తో నేషనల్ లేవల్లో సత్తా చాటాడు.












Click it and Unblock the Notifications