అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ !
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఈ వార్తతో అటు మెగా కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యుల రాక..
కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. మైసూర్‌లో ఉండగా మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ చేరుకోన్నారు. ఇక ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఇప్పటికే వచ్చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్‌లో పబ్లిక్ మీటింగ్‌లో ఉండటంతో.. వారు రేపటికి హైదరాబాదుకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు.

సినీ ప్రముఖుల సంతాపం..
ఈ వార్త తెలుసుకున్న వెంటనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని కనకరత్నమ్మ గారి పార్ధివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అభిమానులు కూడా ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తరలివస్తుండటంతో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
కోకాపేటలో అంత్యక్రియలు..
ఉదయం 9 గంటలకు కనకరత్నమ్మ గారి భౌతికకాయం అల్లు అరవింద్ నివాసానికి తరలించారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మా అత్తయ్య, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు. అల్లు కనకరత్నమ్మ జీవితం మొత్తం కుటుంబం కోసం చేసిన సేవ, చూపిన అపారమైన ప్రేమ, కష్టసమయంలో నిలిచిన ధైర్యం.. ఇవన్నీ ఎల్లప్పుడూ అల్లు కుటుంబానికి మార్గదర్శకంగా నిలుస్తాయని కుటుంబ సభ్యులు, అభిమానులు భావోద్వేగంతో గుర్తుచేసుకుంటున్నారు.
మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 30, 2025
మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః 🙏












Click it and Unblock the Notifications