రామ్‌చరణ్ 'గేమ్‌ఛేంజర్' ఫ్లాప్‌పై అల్లు అరవింద్ సెటైర్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించి గేమ్ ఛేంజర్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై తీవ్ర నిరాశ పరిచింది. దర్శకుడు శంకర్ కాలం చెల్లిన కథ, కథనాలతో ఈ సినిమాను రూపొందించి చెడ్డపేరు తెచ్చుకున్నారు. గేమ్ ఛేంజర్ కు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఇదే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ.350 కోట్లవైపు దూసుకుపోతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానరుపై భారీ బడ్జెట్ తో తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల ఏడోతేదీన విడుదల కాబోతోంది.
నేలవైపు చూపించిన సినిమా గేమ్ ఛేంజర్
ఈ సందర్భంగా తండేల్ చిత్ర ముందస్తు విడుదల వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సంక్రాంతికి దిల్ రాజు చరిత్ర సృష్టించారన్నారు. ఒక సినిమాను ఇలా.... తీసుకువెళ్లారు అంటూ నేలపైకి చూపించారు. అలాగే మరో సినిమాను ఇలా... తీసుకువెళ్లారు అంటూ ఆకాశంవైపు చూపించారు. నేలవైపు చూపించిన సినిమా గేమ్ ఛేంజర్ అని, ఆకాశంవైపు చూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని అర్థం వచ్చేలా పరోక్షంగా చెప్పారు. అలాగే ఐటీ అధికారులను కూడా దిల్ రాజు రప్పించారంటూ హాస్యమాడారు.

ట్రోలింగ్ చేయడం మానుకోండి
దీనికి దిల్ రాజు పగలబడి నవ్వడంతోపాటు ఈ జనవరిలో మేం కొట్టామని, ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారన్నారు. ఇద్దరూ ఛలోక్తిగా మాట్లాడుకున్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం గేమ్ ఛేంజర్ పై సెటైర్లు వేశారంటూ మెగా అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ గురించి ఆయన చెప్పిన విధానం చాలా అవమానకరంగా ఉందంటున్నారు. నిర్మాతలిద్దరూ ఛలోక్తిగా తమ సినిమాల గురించి చెబితే పనిలేని నెటిజన్లు మొత్తం అల్లు అరవింద్ ఇలా మాట్లాడాడు.. అలా మాట్లాడాడు.. అవమానకరంగా ఉందంటూ అనవసరమైన ట్రోలింగ్ చేయడం మానుకోవాలని కొంతమంది హితవు పలుకుతున్నారు. ఇటువంటివే వివాదాలకు కారణమవుతాయంటున్నారు.
గేమ్ ఛేంజర్ మీద అల్లు అరవింద్ సెటైర్లు.!#RamCharan #DilRaju #AlluAravind #Thandel #NagaChaitnaya #OITelugu pic.twitter.com/27SaU0u2tZ
— oneindiatelugu (@oneindiatelugu) February 3, 2025












Click it and Unblock the Notifications