అల్లు అర్జున్, రామ్‌చరణ్ మధ్య గొడవను అడ్డుకున్న అల్లు అరవింద్?

చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట అనంతరం బన్నీ జైలుకు వెళ్లడం.. బెయిల్ పై బయటకు రావడం.. తర్వాత చిరంజీవి, నాగబాబు ఇళ్లకు స్వయంగా వెళ్లి కలవడం జరిగిపోయాయి. ఆ తర్వాత విభేదాలన్నీ సద్దుమణిగాయని, అందరూ కలిసివుంటారని భావిస్తున్నారు. అయితే పుష్ప2 నిర్మాతలు చేయబోయిన ఓ ప్రయత్నంవల్ల మళ్లీ విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రహించడంతో రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య తిరిగి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 0

కావాలనే చేస్తున్నారంటున్న మెగా అభిమానులు
పుష్ప2 సినిమాలో అదనంగా ఓ 20 నిముషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీ నుంచి థియేటర్లలో వీటిని ప్రదర్శింపచేసేలా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. పుష్ప2 సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 20 నిముషాలు ఉంది. మరో 20 నిముషాలు యాడ్ చేస్తే 3 గంటల 40 నిముషాలు అవుతుంది. పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో సంక్రాంతి నుంచి ప్రదర్శిస్తే అదనంగా కలెక్షన్లు వస్తాయని నిర్మాతల ఆలోచనగా ఉంది. ఇప్పటికే 10వ తేదీన విడుదల కాబోతున్న రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కు పోటీగా కావాలనే ఇలా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. విభేదాలు చల్లారలేదని, తిరిగి కావాలనే ఇలా చేస్తున్నారంటూ మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులపై విరుచుకుపడ్డారు.

Allu Aravind suggests producers to release Pushpa 2 Reloaded version from 17th january

రంగప్రవేశం చేసిన అల్లు అరవింద్
ఇటువంటి తరుణంలో అల్లు అరవింద్ రంగప్రవేశం చేసి నిర్మాతలతో మాట్లాడారు. అదనపు సన్నివేశాలను జనవరి 1 నుంచి ప్రదర్శించివుంటే బాగుండేదని, ఇప్పుడు వద్దని, ఈనెల 17వ తేదీ నుంచి ప్రదర్శింపచేయండంటూ సూచించారు. సంక్రాంతికి మూడు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయని, సినీప్రియులంతా వాటిని చూడటానికి ఆసక్తి చూపిస్తారుకానీ పుష్ప2 చూడటానికి రారని, 17 తర్వాత అయితే మూడు సినిమాల ఫలితం తేలుతుందని, తర్వాత ప్రేక్షకులు యాడ్ చేసిన సన్నివేశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పారు. దీంతో నిర్మాతలు కూడా అల్లు అరవింద్ చెప్పినదానికి అంగీకరించడంతో జనవరి 17వ తేదీ నుంచి అదనపు సన్నివేశాలను చూపించబోతున్నారు. లేదంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య జరగబోయే పెద్ద గొడవను అల్లు అరవింద్ ఆపినట్లేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న విభేదాలు పెద్దవి కూడా చూశారని కొందరు అరవింద్ ను ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+