పుష్పతో "ఘాటి" మూవీ కనెక్షన్.. అల్లు అర్జున్ - అనుష్క ఫోన్ కాల్ వైరల్ !
అనుష్క శెట్టి.. లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి పవర్‌ఫుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. "అరుంధతి", "రుద్రమదేవి", "భాగమతి" వంటి బలమైన మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు "ఘాటి" అనే యాక్షన్ డ్రామాలో శీలావతిగా కనిపించనున్నారు. విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తూర్పు కనుమల్లో జరిగే గంజాయి వ్యాపారం నేపథ్యంలో సాగే స్టోరీతో మూవీ రానుంది.
ఇందులో విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, చైతన్య వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. సాయిమాధవ్ బుర్ర డైలాగులు, సాగర్ సంగీతం, అద్భుతమైన టెక్నికల్ టీమ్ కలసి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా.. సెప్టెంబర్ 5న ఘనంగా రిలీజ్ అవ్వబోతోంది.

అల్లు అర్జున్-అనుష్క ఫోన్ కాల్..
అయితే అనుష్క సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆమె లావుగా ఉన్న కారణం గానే మీడియా ముందుకు రావట్లేదని అంటున్నారు. అందుకే అనుష్క ప్రమోషన్స్ లో వినూత్న పంథాను ఎంచుకుంది. ఇప్పటికే హీరో రానాతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ వైరల్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా అనుష్క.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మాట్లాడిన ఆరు నిమిషాల ఫోన్ సంభాషణను రిలీజ్ చేశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మేరకు వారిద్దరూ కలిసి నటించిన 'వేదం', 'రుద్రమదేవి' రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ సరదాగా నిన్ను స్వీటీ అని పిలవాలా లేక ఘాటి అని పిలవాలా?" అని అడగగా, అనుష్క నవ్వుతూ "ఎప్పుడూ స్వీటీనే" అని సమాధానమిచ్చారు. అలానే అనుష్క మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారని ప్రశంసించారు.
పుష్ప - ఘాటి కనెక్షన్?
ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న "ఘాటి కథ, పుష్ప యూనివర్స్‌తో కనెక్ట్ అయిందట" అనే వార్తలపై అనుష్క క్లారిటీ ఇచ్చారు. నేను అలా చెప్పలేదు. ఒక ఇంటర్వ్యూలో సరదాగా సుకుమార్ కి ఆ విషయం చెప్పాలని అన్నానంతే" అని క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ సరదాగా - "ఒకవేళ పుష్పరాజ్, శీలావతి కలిసి ఓ సినిమాలో నటిస్తే, ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది?" అని ప్రశ్నించగా, అనుష్క తెలివిగా.. "సుకుమార్, క్రిష్ ఇద్దరూ నాకు ఎంతో ముఖ్యమైనవారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం" అని అన్నారు. ఇక ఈ సినిమాతో స్వీటీ గ్రాండ్ సక్సెస్ అందుకోవడం గ్యారంటీ అని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శీలావతి:
— Krish Jagarlamudi (@DirKrish) September 4, 2025
వాళ్లు ఊరుకోరు..వీళ్లు ఊరుకోరు అంటే.. నేను ఊరుకోను
పుష్ప రాజ్ :
తగ్గేదే లే 🔥
What a magnificent display of camaraderie n grace from 'Icon Star' @alluarjun garu. An immensely heartfelt thank u for ur wonderful call to 'The Queen' @MsAnushkaShetty ahead of #Ghaati's… pic.twitter.com/IfPf8ebSkJ












Click it and Unblock the Notifications