అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న 'AA23' సినిమాపై ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ కొన్ని వార్తలు వస్తుండగా.. మరికొన్ని వర్గాలు మాత్రం ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉందని చెబుతున్నాయి. ఈ ఊహాగానాలు అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎలాంటి తాజా అప్‌డేట్స్ రాకపోవడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటున్నట్లు అటు అల్లు అర్జున్ గానీ, ఇటు లోకేష్ కనగరాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు. తన ప్రస్తుత కమిట్మెంట్ పూర్తయిన తర్వాతే ఆయన లోకేష్ కనగరాజ్‌తో చేసే సినిమాను పట్టాలెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'AA23' సినిమా ద్వారా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ పాన్-ఇండియా పాపులారిటీ, స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లోకేష్ క్రేజ్ కలగలిపి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రకటన సమయంలో వచ్చిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ.. ఆ తర్వాత స్టోరీ, నటీనటులు లేదా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్లు రాలేదు.

మరోవైపు లోకేష్ కనగరాజ్ త్వరలో మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్లపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాకపోవడం గమనార్హం. అలాగే అల్లు అర్జున్ తిరిగి బోయపాటి శ్రీనుతో సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే అఖండ-2 డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ఆ వైపుగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుంతం బన్నీ చాలా బిజీగా ఉండటంతో పాటు స్టార్ డైరెక్టర్లు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ఇలా పలువురి పేర్లు, ప్రాజెక్టులు చర్చలోకి రావడంతో 'AA23'పై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ సినిమా ఎక్కడికీ పోలేదని, షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని మా వర్గాలు ధ్రువీకరించాయి. వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.














Click it and Unblock the Notifications
