రామ్ చరణ్ "పెద్ది"కి కౌంటరిచ్చిన అల్లు అర్జున్..ఇది సార్ అల్లు బ్రాండ్

గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిచ్చారు.

అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్'సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో మెగా అభిమానులపై అల్లు అభిమానులు పైచేయి సాధించినట్టు అయింది. ఈక్రమంలోనే రామ్ చరణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం "పెద్ది".ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Allu Arjun and Ram Charan fans are at war on social media

శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ షాట్ పేరిట గ్లింబ్స్‌ను రిలీజ్ చేశారు.టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు ,తమ అభిమాన హీరో కొత్త సినిమా ఆప్డేట్‌ను నేషనల్‌ లేవల్లో ట్రెండ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్‌లో త్వరలో సినిమా రాబోతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన రానుందని తెలుస్తోంది.దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్‌గా... ఈ రోజు(ఆదివారం) నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫొటోలు ,వీడియోలను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. నేషనల్ లేవల్లో అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి ట్రెండ్ చేస్తూ.. ఇది సార్ మా అల్లు బ్రాండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+