"శక్తి మాన్"గా అల్లు అర్జున్.. మల్లు డైరెక్టర్ తో డెడ్లీ కాంబో !

ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప 2 అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నారు బన్నీ. కాగా ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఆయన ఓ మల్లు డైరెక్టర్ తో సూపర్ హీరో మూవీ చేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్, డీసీ ఫ్రాంచైజీలతో హాలీవుడ్ లో బోలెడు సినిమాలు వచ్చాయి. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆ చిత్రాలు బిలియన్ల డాలర్ల కలెక్షన్లను రాబట్టాయి. ఇండియన్ సినిమాల్లో ఈ తరహా మూవీస్ తక్కువే వచ్చాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నానికే అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

allu-arjun-as-shakti-man-under-basil-joseph-direction

బన్నీ మూవీ ఎవరితో అంటే..?

మళయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శకుడిగా టోవినో థామస్ తో 'మిన్నల్ మురళి' అనే సూపర్ హీరో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. లిమిటెడ్ బడ్జెట్‌లో ఉన్నప్పటికీ.. మంచి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో అదరగొట్టింది ఈ సినిమా. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ రూపొందించబోయే చేసిన భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని.. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన సినిమానే ఆ లెవెల్లో ఉంటే.. భారీ బడ్జెట్ ఉంటే బసిల్ తప్పకుండా టాలెంట్ నిరూపించుకుంటారని అంటున్నారు.

ఏ క్యారెక్టర్ అంటే..?

అల్లు అర్జున్ - బసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం 'శక్తిమాన్' పాత్రను ఆధారంగా తీసుకుని ఉండొచ్చని సమాచారం. 90వ దశకంలో ముఖేష్ ఖన్నా ప్రధాన పాత్రలో టీవీపై ప్రసారమైన 'శక్తిమాన్' సీరియల్ అప్పట్లో పిల్లల్ని, పెద్దల్నీవిపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి పాయింట్ ఆధారంగా ఒక మోడరన్, హైటెక్ సూపర్ హీరో కథను బన్నీ కోసం డెవలప్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రికార్డులు తిరగరాసిన బన్నీ.. సూపర్ హీరో పాత్రలో పాన్ వరల్డ్ రికార్డులను టార్గెట్ చేయడం పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

allu-arjun-as-shakti-man-under-basil-joseph-direction
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+