జగన్ ప్రభుత్వంతో అల్లు అర్జున్ చర్చలు ..వెయ్యి కోట్ల ఒప్పందం..?
వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే పరిస్థితి. పైగా ఎన్నికలు తేదీ దగ్గర పడటంతో వైసీపీ, జనసేన శ్రేణులు కత్తులు దూసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. జగన్ ఓటమి గురించి ఏకంగా సీఎం పదవినే పవన్ కల్యాణ్ త్యాగం చేశారు.
ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో ఏకంగా జగన్ ప్రభుత్వంతో బిజినెస్ డీల్ మాట్లాడుకోవడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరో మరెవ్వరో కాదు అల్లు అర్జున్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తునే వ్యాపారంపై కూడా ఓ కన్నేశాడు. గీతా ఆర్ట్స్ పేరిట అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సైతం థియేటర్లను నిర్మిస్తున్నారు. AAA పేరిట ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ మల్టిఫ్లెక్స్‌ను నిర్మించారు.

ఇప్పుడు ఏపీలో కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంతో అల్లు అర్జున్ చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో పెట్టుబడులపై ఏపీ సీఎం జగన్‌తో అల్లు అర్జున్ చర్చించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. విశాఖలో ఏకంగా వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చినట్టు సమాచారం.
విశాఖలో జరుగుతున్న అభివృద్దిని చూసే అల్లు అర్జున్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ విశాఖలో పర్యటించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ..ఇది నిజం అయితే కనుక పవన్ అభిమానులకు అల్లు అర్జున్ మరోసారి టార్గెట్ అవుతారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

గతంలో ''చెప్పను బ్రదర్'' అంటూ అల్లు అర్జున్, పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు పవన్ బద్దశత్రువు అయిన జగన్ ప్రభుత్వంతో అల్లు అర్జున్ బిజినెస్ కుదుర్చుకుంటే అభిమానులు ఊరుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పవన్ ,అల్లు అర్జున్ అభిమానులు తరచూ గొడవకు దిగుతున్నారు. అయితే ఈ బిజినెస్ డీల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.












Click it and Unblock the Notifications