జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు ఆరోతేదీన విడుదల కావాల్సి ఉంది. ఒకరోజు ముందుకు విడుదల తేదీని జరిపే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక గీతం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. తృప్తి దిమ్రితో లేదంటే శ్రద్ధాకపూర్ తో చేయించాలనే యోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇలా జరుగుతుండగా... మరోవైపు హీరో అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే సంగతి తెలిసిందే.
తారక్ వస్తే బాగుంటుంది
ఈ విభేదాలు తన పుష్ప2 సినిమాపై పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం తనదగ్గరున్న సోషల్ మీడియా సైన్యంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా కూడగడుతున్నారు. అంతేకాదు.. ఈ సినిమా ఈవెంట్ కు తారక్ ను తీసుకువచ్చే యోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బన్నీ సోషల్ మీడియా ఆర్మీ, తారక్ అభిమానులు మూకుమ్మడిగా మెగా అభిమానులపై దాడి చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల దండయాత్రకు మెగా అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై రామ్ చరణ్ అభిమానులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.

మలుపులు తిరుగుతున్న బన్నీ రాజకీయం
వాస్తవానికి ఆగస్టు 15నే సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులతో ఉన్న గొడవల్లే దీన్ని వాయిదా వేశారు. సినిమా ఫ్లాప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజుకు విభేదాలు తగ్గలేదు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తో బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారనే విషయం తెలిసిందే. బావా.. బావా.. అంటూ ఎంతో చనువుగా పిలుచుకుంటుంటారు. పుష్ప2 విడుదలకు మెగా అభిమానులు బాయ్ కాట్ చేస్తే తారక్ అభిమానులతో ఆ స్థానాన్ని భర్తీ చేయించాలనే ప్లాన్ బన్నీది. దీనివల్ల సినిమా కలెక్షన్లపై ఎటువంటి ప్రభావం పడదని, అనుకున్నస్థాయిలోనే కలెక్షన్లు వస్తాయని బన్నీ భావిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఈ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications