ప్రభాస్, మహేష్ : బెస్ట్ హీరో అతనికే ఓటు వేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలిచ్చారు. రొమాన్స్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా అని ప్రశ్నించగా, తొక్కలో యాక్షన్, రొమాన్స్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ తేల్చేశారు. హీరోయిన్ల ఎవరంటే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ సరదాగా స్పందించారు.
పూజా హెగ్డెతో నటించడం ఇష్టమా, రష్మికతో నటించడం ఇష్టమా అని ప్రశ్నించిన బాలయ్య తనకైతే రష్మికనే ఇష్టమని తేల్చేశారు.నాకు కూడా రష్మికనే ఇష్టమని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో మహేష్ బాబు, ప్రభాస్ వీరిలో నీకు ఎవరు పోటీ అని భావిస్తున్నావు అని బాలయ్య ప్రశ్నించగా, దానికి అల్లు అర్జున్ అచితూచి సమాధానం ఇచ్చారు. అయితే తనకు ఎవరూ పోటీ కాదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ''నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే, అది రేపటి నేనే'' అంటూ దీనికి సమాధానం ఇచ్చారు.

''మహేష్ బాబు గారు అంటే అందరూ ఆయన అందం గురించి మాట్లాడతారు. ఏదేమైనా ఆయన అందగాడు అని తెలిసిందే. నాకు పర్సనల్‌గా నచ్చే విషయం ఏంటంటే, ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్ తర్వాత ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. దానికి నేను ఆయన్ను చాలా అడ్మైర్ చేస్తాను. ఆయనలో అది నాకు నాకు చాలా ఇష్టమైన విషయం. ఆయన ట్రూ సినిమా లవర్. ఆయన చిత్రాలతో తెలుగు సినిమా స్టాండర్డ్ ను పెంచిన యాక్టర్. నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉందని అల్లు అర్జున్ తెలిపారు.
ఇక ప్రభాస్ గురించి ఎప్పుడు అడిగిన తనది ఒకటే మాట అని... ఆరుడుగుల బంగారం అంతే అని ప్రభాస్ గురించి అల్లు అర్జున్ తెలిపారు. ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ..ఆయన ముక్కుసూటి తత్వం అంటే ఇష్టమని, ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తారని ..కళ్యాణ్ గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చాలామందిని ఫాలో అవుతుంటాను. కానీ నేను చూసిన వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు'' అని అల్లు అర్జున్ తెలిపారు. అయితే పవన్ ,












Click it and Unblock the Notifications