అతను పవన్ కల్యాణ్‌కు క్లోజ్.. అందుకే స్పందించని అల్లు అర్జున్?

తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి చెందిన అందరి సభ్యులకు, ఆ కుటుంబం నుంచి విడిపోయిన అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు రోజురోజుకు ముదిరిపోతున్న సంగతి తెలిసిందే. నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు మహేష్ బాబు, నాని లాంటి హీరోలు కూడా విషెస్ చెప్పినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. బన్నీ వాసు నిర్మించిన హాయ్ సినిమాకు మాత్రం ట్వీట్ చేశాడు. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కల్యాణ్ వీరాభిమాని కాబట్టి
తెలుగు సినిమా నుంచి ఈ అవార్డు రాకపోయినప్పటికీ తమిళంలోని తిరుచిత్రాంబళం అనే సినిమాకు మరో నృత్య దర్శకుడు సతీష్ కృష్ణన్ తో కలిసి ఉమ్మడిగా అవార్డును అందుకోబోతున్నారు. అవార్డుల ప్రకటన వచ్చినతర్వాత పరిశ్రమలోని ప్రముఖులంతా జానీ మాస్టర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీనిపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ స్పందించకపోవడానికి కారణం పవన్ కల్యాణ్ కు జానీమాస్టర్ ఎంతో సన్నిహితుడు. జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేకాదు.. ప్రత్యేకంగా ఓ పాట రూపొందించి దానికి నృత్యదర్శకత్వం చేశారు.

allu arjun did not greetings to johnny master because of he is great fan of pawan kalyan

బన్నీకి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు
అల వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సినిమాతోపాటు మరెన్నో పాటలకు జానీ మాస్టర్ బన్నీకి మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ వీరాభిమాని కావడంవల్లే బన్నీ స్పందించలేదని వార్తలు వస్తున్నాయి. అవార్డులు ప్రకటించి మూడురోజులవుతున్నప్పటికీ ఇంతవరకు కనీసం ట్వీట్ కూడా చేయలేదంటూ కావాలనే చేయడంలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెగా కుటుంబానికి, బన్నీకి మధ్య ఉన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. గెలుపొందిన తర్వాత కూడా బన్నీ కేవలం ట్వీట్ చేసి సరిపెట్టాడు. పవన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆహ్వానం లేదని మెగా అభిమానులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+