అల్లు అర్జున్‌కు ముఖం చాటేసిన 'ఆమె'?

సినీ రంగంలో బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తూ స్టార్ హీరోగా మారిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనేక కష్టాలను అధిగమించిన తర్వాత 21సీట్లలో పోటీచేసి మొత్తం 21 సీట్లను గెలిపించుకున్న అరుదైన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఎన్నికల ఫలితాల సమయంలో దేశం మొత్తం జనసేనాని వైపు చూపించింది. సినిమాల్లోనే పవర్ స్టార్ కాదని, రాజకీయాల్లోను తాను 'పవర్'స్టార్ అని నిరూపించుకున్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా ఐదు శాఖలకు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ట్వీట్‌తో సరిపెట్టిన బన్నీ
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికి వచ్చి పెద్దలందరి ఆశీర్వాదం పవన్ తీసుకున్నారు. ఆ వీడియో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. మెగా కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉన్న సమయంలో ఒక్క అల్లు అర్జున్ మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతివ్వడమే కాకుండా తాను స్వయంగా అక్కడికి వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చిన మామయ్య పవన్ కల్యాణ్ కు కేవలం ట్వీట్ ద్వారా మాత్రమే విజయం సాధించాలని ఆకాంక్షించారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ కేవలం ట్వీట్ తో సరిపెట్టారు.

allu arjun differences with mega family nothing is going well

ఏదీ సరిగా కలిసిరావడంలేదు
సరిగ్గా పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాతే అల్లు అర్జున్ కు అన్నీ అపశకునాలు ఎదురవుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నంద్యాల వివాదం రోజురోజుకు పెరిగి పెద్దదై మెగా కుటుంబానికి, తనకు అంతులేని దూరాన్ని పెంచిందనే విషయాన్ని అల్లు అర్జున్ ఇప్పటికీ గమనించలేకపోతున్నారని వీరు విశ్లేషిస్తున్నారు. మెగా అభిమానులతో గొడవ జరుగుతుండటంతో పుష్ప2 సినిమాను డిసెంబరు 6కు వాయిదా వేశారు. అంతేకాకుండా అట్లీతో చేయాల్సిన సినిమా కూడా రద్దయింది. అతను ఎక్కువ పారితోషికం అడగడంతో నిర్మాణ సంస్థ సినిమానే వద్దనుకుంది. దీంతో అట్లీ ఈ కథను సల్మాన్ ఖాన్ కు వినిపించారంటున్నారు. తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇది ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. ఏదేమైనప్పటికీ పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లు అర్జున్ కు ఏదీ కలిసిరావడంలేదని, అదృష్ట దేవత ముఖం చాటేసిందంటున్నారు. ఇది నిజమే అని నెటిజన్లు సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+