అల్లు అర్జున్ ఫేస్‌కు రెండు సర్జరీలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్
హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అల్లు రామలింగయ్య మనవడుగా ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు అల్లు అర్జున్. అప్పట్లో మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అల్లు అర్జున్‌కు పుష్కలంగా ఉండటంతో , ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మెగా హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారాయన. ఆయన పేరు మీద ఓ ఆర్మీ ఉందంటే అల్లు అర్జున్ పాపులారిటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళలో కూడా అల్లు అర్జున్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతుంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి. అంతలా బన్నీని కేరళ ఫ్యాన్స్ అభిమానిస్తారు. ఇక పుష్ప సినిమాతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ మేనరిజానికి బాలీవుడ్ అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప పార్ట్ 2 కోసం తెలుగు ప్రజల కన్నా బాలీవుడ్ జానాలే అతృతుగా ఎదురు చూస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్లలో చాలా విమర్శలను ఫేస్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా పనికి రాడంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ మొహం హీరోలా ఉందా అంటూ హేళన చేశారు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ తనని తాను మార్చుకుని ఆర్య సినిమాతో సరికొత్తగా కనిపించారు. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ ఫేస్‌కు సర్జరీలు జరిగాయానే ప్రచారం జరిగింది. తాజాగా అల్లు అర్జున్ సర్జరీలకు సంబంధించి ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ రాజశేఖర్ ఓ ఇంటర్య్వూలో స్పందించారు.
అల్లు అర్జున్ ముక్కుకి, లిప్స్‌కి సర్జరీ చేయించుకుని ఉండవచ్చేనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అమీ జాక్సన్, శోభిత ఫేస్‌లో మార్పు కోసం సర్జరీలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఇక దుల్కర్ సల్మాన్ తన ముక్కుకి రైనోప్లాస్టీ చేయించాడని, అందుకే కాస్త సన్నగా మారిందని డాక్టర్ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇటీవల కొందరు బిగ్‌బాస్ సెలబ్రిటీలు తమ ముక్కు, మూతి బాలేదని నా దగ్గరకు వచ్చి సర్జరీలు కూడా చేయించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications